హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీతారాముల కల్యాణానికి తలంబ్రాలు!

BHPL: భద్రాచలం సీతారాముల కల్యాణానికి కోటి తలంబ్రాల తయారీ కోసం గణపురం మండలం చెల్పూర్‌లో పండించిన వరి కోతలను శనివారం భక్తిశ్రద్ధలతో  ప్రారంభించారు. శ్రీరామదాసు భక్తమండలి ఆధ్వర్యంలో తిరుపతమ్మ–తిరుపతి దంపతులు కార్యక్రమాన్ని చేపట్టారు. 11 ఏళ్లుగా ఈ పవిత్ర సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు వారు చెప్పారు. 2 రోజుల పాటు కోత జరుగుతుందన్నారు.