హైదరాబాద్: 28°C
తెలంగాణ

​కేజీబీవీలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

SRD: న్యాల్‌కల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్ లలిత ఆధ్వర్యంలో భారత తొలి ప్రధాని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం దినోత్సవ ప్రాముఖ్యతను ప్రిన్సిపాల్ విద్యార్థినులకు వివరించగా, బాలికలు బెలూన్లతో సందడి చేస్తూ శుభాకాంక్షలు పంచుకున్నారు.