హైదరాబాద్: 28°C
తెలంగాణ

మళ్లీ కనిపించిన మొసలి

VKB: దౌల్తాబాద్ మండలంలోని పెద్ద చెరువులో మొసలి మళ్లీ ప్రత్యక్షమైంది. గత కొన్ని నెలలుగా కనిపించకుండా పోయిన మొసలి, చెరువులో నీటిమట్టం తగ్గడంతో గట్టుపై కనిపించింది. జనావాసాలకు సమీపంలో సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించి, మొసలిని బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించాలని ప్రజలు కోరుతున్నారు.