ASF: దహేగాంలోని PHCని MLA డా.పాల్వాయి హరీష్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందితో అక్కడున్న సమస్యలను తెలుసుకొని అదనపు నియామకాలు చేపట్టి ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి కంకణం కట్టుకున్నామని, ఇప్పటికే పలు ఆసుపత్రులు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని, పేషంట్ల ఇన్ఫ్లో కూడా పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
PHCలో ఎమ్మెల్యే హరీష్ బాబు ఆకస్మిక తనిఖీలు


