హైదరాబాద్: 28°C
తెలంగాణ

నమ్మిన వ్యక్తి చేతిలోనే ధాన్యం మాయం?

KMR: పాల్వంచ మండలం వేల్పుగొండలో రైతు ధాన్యం తరలింపు ఘటన కలకలం రేపింది. రైతు వద్ద పనిచేసే వ్యక్తి మూడు ట్రాక్టర్ల ధాన్యం తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాలుగో ట్రాక్టర్ తీసుకెళ్తుండగా రైతు పట్టుకుని డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దొమకొండ రైస్ మిల్లుకు ధాన్యం విక్రయించేందుకు యత్నించినట్లు సమాచారం.