హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ

KMM: వార్షిక తనిఖీలలో భాగంగా ఖమ్మం రూరల్ ఏసీపీ కార్యాలయాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం తనిఖీ చేశారు. కార్యాలయంలోని వివిధ రికార్డులు, కేసుల వివరాలు, పెండింగ్ ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐలు ముష్కరాజు, మురళి, సాగర్ వారి వెంట ఉన్నారు.