MBNR: సోమశిల దుర్ఘటన జరిగి 33 ఏళ్లు పూర్తైన సందర్భంగా అప్పటి ఎస్పీ పరదేశి నాయుడుతో పాటు తొమ్మిది మంది పోలీసు అమరవీరులకు జిల్లా ఎస్పీ డి.జానకి నివాళులర్పించారు. 1993లో మావోయిస్టుల మందుపాతర పేలుడులో తొమ్మిది మంది పోలీసులు వీరమరణం పొందగా, వారి త్యాగాలు మరువలేనివని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
పోలీసు అమరవీరులకు ఎస్పీ నివాళులు


