హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిబంధనలకు విరుద్ధంగా పెట్రోల్ బంక్.. కలెక్టర్‌కు ఫిర్యాదు

జగిత్యాల జిల్లా కోరుట్లలోని కోర్టు భవనానికి సుమారు 40 మీటర్ల దూరంలో నూతనంగా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసేందుకు నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో, ప్రజల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నిర్మాణానికి సంబంధించి అనుమతులు, భద్రతా నిబంధనలను సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కోరుట్ల పట్టణ ప్రజల తరఫున జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.