హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రితో గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధుల భేటీ

ఖమ్మం గ్రానైట్ స్లాబ్ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు గోపాల్‌రావు, కార్యవర్గ సభ్యులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కమిటీకి మంత్రి అభినందనలు తెలిపారు. గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.