హైదరాబాద్: 28°C
తెలంగాణ

విధుల్లోకి చేరిన NHM ఉద్యోగులు

KMM: జిల్లాలో NHM పరిధిలో పనిచేస్తున్న 576 మంది ఉద్యోగులు 32 రోజులుగా నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు తాత్కాలిక విరామం ప్రకటించారు. తిరిగి విధుల్లో చేరారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చల్లో అధికారులు సానుకూలంగా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం DMHO డా. రామారావును కలిసి విధుల్లో చేరారు. ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరడం అభినందనీయమని ఆయన అన్నారు.