హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుడుంబా స్థావరాలపై దాడి..34 మంది అరెస్ట్

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 45 తండాల్లో ఎక్సైజ్, స్టేట్ టాస్క్‌ఫోర్స్, పోలీసులు గుడుంబా స్థావరాలపై దాడులు చేసినట్లు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ నవీన్ కుమార్ వెల్లడించారు. దాడుల్లో 9,450 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశామన్నారు. 217 లీటర్ల నాటుసారా, ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 34 మందిని అరెస్టు చేసి 64 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.