KMR: జిల్లాలో గత 32 రోజులుగా NHM ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు JAC అధ్యక్షుడు సుమన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నిన్న వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర కమిషనర్‌తో రాష్ట్ర JAC జరిపిన చర్చల్లో పలు నిర్ణయాలు తీసుకున్నారని, ఉద్యోగుల డిమాండ్ల విషయమై ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటై మూడు నెలల్లో నివేదిక సమర్పించనుందన్నారు.
తెలంగాణ
NHM ఉద్యోగుల నిరవధిక సమ్మె విరమణ


