హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

HYD: కేరళ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానం 6E-244కు బాంబు బెదిరింపు వచ్చింది. విమానం బాత్రూంలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి పేపర్‌పై రాసి అతికించాడు. దీనిని గుర్తించిన ప్రయాణికులు సిబ్బందికి సమాచారం అందించారు. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది విమానంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.