హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముస్తాబైన మహిళా స్వశక్తి భవనాలు

SRD: కంది మండలంలోని 22 గ్రామపంచాయతీలకు గాను 16 చోట్ల మహిళా స్వశక్తి భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఒక్కో భవనానికి రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. మహిళా సంఘాల సభ్యులు సమావేశాలు నిర్వహించుకునేందుకు వీటిని నిర్మించారు. పూర్తయిన భవనాలను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.