NGKL: బిజినపల్లి మండలం వట్టెంలో కార్తీకమాసం సందర్భంగా శనివారం వెంకటేశ్వర స్వామికి అర్చకులు వైభవంగా పల్లకి సేవ నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు పూలు, పండ్లు, తీర్థప్రసాదాలు అందజేశారు. దీంతో ఆలయ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ
వైభవంగా వెంకటేశ్వర స్వామి పల్లకి సేవ


