హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీ నిధులు దుర్వినియోగం ?

BHPL: రేగొండ మండలం పెద్దంపల్లి గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగిందని BRS నాయకుడు పసుల రత్నాకర్ ఆరోపించారు. సర్పంచ్ గడ్డే రఘు పైపులైన్ లీకేజీ, చెట్ల తొలగింపు, మోటారు కొనుగోలులో తప్పుడు MB రికార్డులు సృష్టించి నిధులు పక్కదారి పట్టించారని పేర్కొన్నారు. గతంలో కార్యదర్శి రూ.2.10 లక్షలు మాయం చేశారన్నారు. అధికారులు స్పందించి విచారణ చేయాలని డిమాండ్ చేశారు.