హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రాథమిక పాఠశాలకు సొంత భవనం లేక ఇబ్బందులు

ASF: తిర్యాణి మండలం పునగూడలో గిరిజన ప్రాథమిక పాఠశాలకు సొంత భవనం లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన వసతులు లేక చదువులకు ఆటంకం కలుగుతోందని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పాఠశాల భవనం నిర్మించాలని కోరారు.