హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి'

GDWL: ఈ నెల 15 -18 వరకు నల్గొండలో నిర్వహించనున్న AIKS 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని టీజీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి పిలుపునిచ్చారు. శనివారం గద్వాల సీఐటీయూ కార్యాలయంలో మహాసభల గోడపత్రికను ఆవిష్కరించారు. ఆదివారం నల్గొండ ఎన్జీ కాలేజీ మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు జిల్లా రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నారు.