హైదరాబాద్: 28°C
తెలంగాణ

తండ్రికి కొడుకై కుమార్తె అంతిమ వీడ్కోలు!

BHNG: జాల గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు బత్తుల బాలయ్య శనివారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు కుమారులు లేకపోవడంతో కుమార్తె కనకమ్మ తండ్రి అంత్యక్రియల బాధ్యతను చేపట్టింది. తానే కొడుకై తండ్రి పాడె వెంట నడిచి, చితికి నిప్పంటించి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. కన్నతండ్రిపై ఆమె చూపిన ప్రేమాభిమానాలను చూసి గ్రామస్థులు కన్నీటిపర్యంతమయ్యారు.