ASF: ఆసిఫాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 73వ సహకార వారోత్సవాలను పురస్కరించుకుని శనివారం పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు అలీ బిన్ అహ్మద్ జెండాను ఆవిష్కరించారు. సహకార రంగం అభివృద్ధిలో రైతులు, సహకార సంఘాల పాత్రను గుర్తు చేసుకున్నారు. రైతుల అభ్యున్నతికి సహకార సంఘాలు అందిస్తున్న సేవలను వివరించారు.
తెలంగాణ
'రైతుల అభ్యున్నతికి సహకార సంఘాల కృషి'


