హైదరాబాద్: 28°C
తెలంగాణ

NHM కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మెకు తాత్కాలిక విరమణ

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో NHM కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నట్లు జేఏసీ నాయకులు శనివారం ప్రకటించారు. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర హెల్త్ కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు JAC తెలిపింది. ప్రభుత్వంపై నమ్మకంతో పాటు ప్రజలకు వైద్య సేవల్లో ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో సమ్మె తాత్కాలికంగా విరమించామన్నారు.