MDK: తూప్రాన్ ఆయుర్వేద ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని ఆయుష్ కమిషనర్ ఆయేషా మస్రత్ ఖనమ్ తెలిపారు. ఆమె ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి, అందుబాటులో ఉన్న స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రి అభివృద్ధికి నిధులు, అవసరమైన సిబ్బందిని కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ పరమేశ్వర్ నాయక్, ఆర్డీడీ ప్రమీల దేవి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
తూప్రాన్ ఆయుర్వేద ఆసుపత్రి అభివృద్ధికి కృషి


