WGL: పర్వతగిరి మండలం ధూపతండాకు చెందిన డీఎస్. సింధు జాతీయ స్థాయి సబ్‌జూనియర్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో తృతీయ స్థానం సాధించి కాంస్య పతకం గెలుచుకుంది. శనివారం మాజీ పీఏసీఎస్ ఛైర్మన్ మనోజ్ గౌడ్, సింధును శాలువాతో ఘనంగా సన్మానించారు. మారుమూల తండా నుంచి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం గర్వకారణమని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
తండా బిడ్డకు జాతీయ గుర్తింపు


