SDPT: జగదేవ్పూర్ మండలం బి.జి. వెంకటాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ పరమేశ్వర్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాల గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో బాలల హక్కులు, విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత వంటి అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
బాలల దినోత్సవం సందర్భంగా బాల గ్రామసభ


