హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

SRPT: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 18 వరకు పొడిగించినట్లు, డీఐఈఓ సులోచన రాణి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా 18 వరకు, రూ.100 ఆలస్య రుసుముతో 19 నుంచి 25 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. విద్యార్థులు గడువులోగా ఫీజులు చెల్లించాలని సూచించారు..