హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థను అరికట్టాలి'

NGKL: కల్వకుర్తి మండలం తాండ్రలో పంచాయతీ కార్యదర్శి సాయిలీల ఆధ్వర్యంలో శనివారం బాలల సంక్షేమం, రక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఉపసర్పంచ్ సరిత మాట్లాడుతూ.. 18 ఏళ్ల లోపు పిల్లలందరూ పాఠశాలల్లో చదువుకోవాలని, బాల కార్మిక వ్యవస్థ, బాల్యవివాహాలు, పిల్లల అక్రమ రవాణాను అరికట్టాలని పిలుపునిచ్చారు. గ్రామంలో బాల్యవివాహాలు జరగకుండా పంచాయతీ తీర్మానం చేశారు.