హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలి'

ADB: బోథ్ మండలంలోని కరత్వాడ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా సర్పంచ్ దుర్వ విశ్వేశ్వర్ రావు అధ్యక్షతన శనివారం బాల గ్రామ సభ నిర్వహించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి సభను ప్రారంభించారు. పిల్లలు తమ సమస్యలను స్వేచ్ఛగా తెలపాలని సర్పంచ్ కోరారు. బాల్య దశలోనే లక్ష్యాలను నిర్దేశించుకుని ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు.