హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యమకారుల ఫోరం జిల్లా కార్యదర్శిగా కుమార్

BHPL: చిట్యాల మండలం గోపాలపురానికి చెందిన కాట్రేవుల కుమార్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఆయన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించారు. ఉద్యమకారుల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేస్తానని కుమార్ తెలిపారు. ఆయన నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.