హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'నెహ్రూ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి'

ADB: ఆదిలాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం దేశ మొదటి ప్రధానమంత్రి దివంగత పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. నెహ్రూ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.