ADB: శ్రీ శబరిమాత బోధనలు ప్రజలందరికీ ఆచరణీయమని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం రూరల్ మండలంలోని అంకోలి గ్రామంలో నిర్వహించిన శబరిమాత ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. గ్రామంలో ఆలయాల నిర్మాణాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ
శ్రీ శబరిమాత బోధనలు ఆచరణీయం: శ్రీనివాసరెడ్డి


