హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలమయంగా నస్తీపూర్ ప్రధాన రహదారి

SRD: హత్నూర మండలం నస్తీపూర్ గ్రామంలోని ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై ఎక్కడ చూసినా గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలన్నారు.