హైదరాబాద్: 28°C
తెలంగాణ

28 ట్రాక్టర్ లోడ్ల ఇసుక స్వాధీనం

WNP: పెబ్బేరు మండలం రంగాపురం గ్రామ శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులపై రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 28 ట్రాక్టర్ లోడ్ల ఇసుకను స్వాధీనం చేసుకుని పోలీసుల భద్రతలో ఉంచారు. అక్రమ ఇసుక నిల్వ, రవాణాపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.