హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

SDPT: బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి, గుండారం, పెరికబండ, తిమ్మాయిపల్లి, గాగిల్లాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ ఛైర్మన్ ఒగ్గు దామోదర్ ప్రారంభించారు. రైతులు దళారుల మాటలు నమ్మి నష్టపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం రైతుల నుంచి ప్రతిగింజను కొనుగోలు చేస్తుందన్నారు