హైదరాబాద్: 28°C
తెలంగాణ

నస్రుల్లాబాద్‌లో 200 లీటర్ల కల్తీ కల్లు పట్టివేత

KMR: నిజామాబాద్ జిల్లా నుంచి కామారెడ్డి జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న 200 లీటర్ల కల్తీ కల్లును శనివారం నస్రుల్లాబాద్ చెక్‌పోస్ట్ వద్ద అబ్కారీ అధికారులు పట్టుకున్నారు. బాన్సువాడ అబ్కారీ సీఐ లావణ్య సంధ్య ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టగా, ఆటోల్లో తరలిస్తున్న కల్తీ కల్లు పట్టుబడింది. దీంతో కల్లును స్వాధీనం చేసుకుని పారబోసినట్లు సీఐ తెలిపారు.