హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్‌లో 15 నుంచి రాష్ట్రస్థాయి ఈత పోటీలు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఈనెల 15 నుంచి 17 వరకు 14 ఏళ్లలోపు బాలబాలికల రాష్ట్రస్థాయి ఈత పోటీలు నిర్వహించనున్నారు. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతాయని డీఈఓ మాధవి, ఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఆడే రామేశ్వర్ తెలిపారు.