ADB: డిసెంబర్ 9న హైదరాబాదులో నిర్వహించే ఆదివాసీ అస్తిత్వ సభను విజయవంతం చేయాలనీ తుడుందెబ్బ జిల్లాధ్యక్షుడు పెందోర్ దాదిరావు పిలుపునిచ్చారు. శనివారం గాదిగూడలో సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఆదివాసీల హక్కులు, అభివృద్ధిపై చర్చలు ఉంటాయని.. ఆదివాసీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో రావాలన్నారు. కార్యక్రమంలో రాజేశ్వర్, భీంరావు, నాగోరావ్, జయవంతరావు పాల్గొన్నారు.
తెలంగాణ
'ఆదివాసీ అస్తిత్వ సభను విజయవంతం చేయాలి'


