హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సాగునీరు లేక ఎండిన నాలుగు ఎకరాల పంట

నిర్మల్ జిల్లా పెంబి మండలంలో సాగునీరు అందక కౌలు రైతు భోధస్ రాజు సాగు చేసిన నాలుగు ఎకరాల పంట ఎండిపోయింది. అప్పులు చేసి, ఎరువులు కొనుగోలు చేసి సాగు చేసిన పంట చేతికి అందకపోవడంతో కోత కోయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కనీసం పశువులకైనా మేతగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆవులతో పంటను మేపించాడు. పెట్టుబడి మొత్తం వృథా కావడంతో రైతు కన్నీరుమున్నీరయ్యాడు.