హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్కూల్ అటెండర్ల జీతాలు చెల్లించాలి'

SRD: పాఠశాలల్లో పనిచేస్తున్న అటెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని TUCC జిల్లా నాయకుడు చిరంజీవి డిమాండ్ చేశారు. కంగ్టి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న జీతాలను తక్షణమే విడుదల చేయాలని, ప్రతి నెల 1వ తేదీన క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.