హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జీరో టిల్లేజ్‌తో సాగు ఖర్చులు తగ్గింపు'

NZB: భూమిని దున్నకుండానే మొక్కజొన్న సాగు చేసే విధానమే జీరో టిల్లేజ్‌ అని మండల వ్యవసాయ అధికారి టి. నర్సయ్య శనివారం తెలిపారు. ఈ పద్ధతిలో గత పంటల అవశేషాలను పొలంలోనే ఉంచి నేరుగా మొక్కజొన్న విత్తనాలు విత్తుతారని వివరించారు. దుక్కి దున్నాల్సిన అవసరం లేకపోవడంతో పెట్టుబడి ఖర్చులు తగ్గడంతోపాటు నేల సారవంతం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.