హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలు'

NLG: జిల్లా గ్రంథాలయ సంస్థలో శనివారం కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించారు. డిజిటల్ యుగంలోనూ పుస్తక పఠనానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆమె సూచించారు.