హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు

MNCL: జైపూర్ మండలంలోని వేలాల గ్రామ పంచాయతీలో శనివారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల సభ ఏర్పాటు చేసి భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ డేగ స్వప్న నగేష్ మాట్లాడుతూ.. పిల్లల హక్కులు, చదువు ప్రాముఖ్యత, బాల కార్మిక నిర్మూలనపై అవగాహన కల్పించారు.