JN: లింగాల ఘనపూర్ మండలం పటేల్ గూడెంలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన సీతాలక్ష్మి నర్సమ్మ ఇంట్లో దేవుని ముందు దీపం వెలిగించి కుమార్తె ఇంటికి జనగామ వెళ్లారు. దీపం కారణంగా పెంకుటింట్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు కోరుతున్నారు.
తెలంగాణ
అగ్నికి ఆహుతైన ఇల్లు!


