హైదరాబాద్: 28°C
తెలంగాణ

గద్వాలలో హైకోర్టు న్యాయమూర్తి పర్యటన

GDWL: జిల్లాలో శనివారం హైకోర్టు న్యాయమూర్తి పుల్ల కార్తీక్ పర్యటించారు. ఎర్రవల్లి మండలంలోని పదో బెటాలియన్ అతిథి గృహం వద్ద కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ చక్రవర్తి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పూడూరు రెవెన్యూ పరిధిలో నూతన జిల్లా కోర్టు భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు.