వరంగల్ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ పూలమాల వేసి నివాళులర్పించారు. నెహ్రూ ప్రధానిగా దేశాభివృద్ధి, విద్య, విజ్ఞాన శాస్త్రం, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు.
తెలంగాణ
నెహ్రూకు కాంగ్రెస్ నివాళి


