GDWL: గద్వాల గ్రంథాలయంలో శనివారం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నీలి శ్రీనివాసులు, విశ్రాంత ఎంఈవో బస్వరాజుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. పుస్తక పఠనంతో జ్ఞానం, వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతాయని, విద్యార్థులు చదివే అలవాటు పెంపొందించుకోవాలన్నారు.
తెలంగాణ
ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు


