హైదరాబాద్: 28°C
తెలంగాణ

పండ్ల మార్కెట్ పనులు పూర్తి చేయాలి: బీజేపీ

వరంగల్ నగరంలోని పండ్ల మార్కెట్‌ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ శనివారం సందర్శించి వ్యాపారులు, రైతుల సమస్యలు తెలుసుకున్నారు. రూ.24 కోట్లతో చేపట్టిన సమీకృత మార్కెట్ నిర్మాణంలో 85 గదుల పనులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.