హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘16న బాలల కోసం ప్రత్యేక ప్రజావాణి’

MLG: బాలల సమస్యల పరిష్కారానికి ఈ నెల 16న ఐడీఓసీతో పాటు, జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత తెలిపారు. బాలలు తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేస్తే సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాలల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.