హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా కురుమూర్తి స్వామి ఆభరణాల ఊరేగింపు

MBNR: దేవరకద్ర కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆత్మకూరులోని SBI బ్యాంకు నుంచి స్వామివారి ఆభరణాలను ప్రత్యేక పూజల అనంతరం ఆలయానికి ఊరేగింపుగా తరలించారు. బ్యాండ్ మేళాలు, భక్తుల కోలాహలం మధ్య వేడుకగా సాగిన ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి పాల్గొన్నారు. కాగా, జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.