SRD: మంజీరా బ్యారేజీ తాగునీటి అవసరాల కోసం సింగూర్ ప్రాజెక్టు నుంచి 0.15 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదలనున్నారు. ఈ నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు, రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
సింగూర్ నుంచి నీటి విడుదల


