హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోస్టుమాస్టర్లపై కేసు నమోదు

SRPT: ప్రజల పొదుపు సొమ్ము దుర్వినియోగం చేసిన ఇద్దరు పోస్టుమాస్టర్లపై పెన్పహాడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆడిట్‌లో సింగారెడ్డిపాలెం పోస్టుమాస్టర్ దుర్గారెడ్డి రూ.51,945, అనంతారం పోస్టుమాస్టర్ రవితేజ రూ.2,36,028 స్వాహా చేసినట్లు గుర్తించారు. పోస్టల్ సూపరింటెండెంట్ హరిప్రసాద్ ఫిర్యాదుతో కేసు నమోదైంది.